Sunday, May 19, 2024
- Advertisement -

బెల్లం అయితే బెస్టు..

- Advertisement -

హీరో నరేష్ నటించిన సినిమా చిత్రం.. భళారే విచిత్రం. నవ్వుల పువ్వులు పూయించిన ఈ సినిమాలో బ్రహ్మానందం లవర్ క్యారెక్టర్ కి ఓ అలవాటు ఉంటుంది. అదే ప్రతి వంటకి బెల్లం వేస్తే ఇష్టం. ఇది అప్పట్లో సంచలనం సృష్టించిన డైలాగ్. ఇప్పుడు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కూడా ప్రతి దానికి బెల్లం వేస్తే బెస్టు అంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇన్నాళ్లు పంచదారతో తయారైన చాక్లెట్లు, బిస్కట్లను ఇక నుంచి బెల్లంతో చేస్తామంటున్నారు. బెల్లం చాక్లెట్లు, బెల్లం బిస్కెట్లు తయారు చేసి మార్కెట్ లోకి వదిలారు కూడా.

ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ లో పంత్ నగర్ వ్యవసాయ పరిశోధకులు ఈ ప్రయోగం చేసి అందరి చేత భేష్ అనిపించుకున్నారు. మన అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా మండలి వారు కూడా ఇలా బెల్లం చాక్లెట్లు, బెల్లం బిస్కట్లు తయారు చేసి పేరు తెచ్చుకుంటారేమో వేచి చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -