Tuesday, May 21, 2024
- Advertisement -

”మైథలాజికల్ ” బ్యాక్ డ్రాప్ లో సినిమా!

- Advertisement -

టాలీవుడ్ లో కాదు ఇతర భాషల్లో ఉన్న హీరోలు కూడా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తో సినిమా చేయడానికి ఎదురు చూస్తుంటారు. అయితే మహేష్ కూడా రాజమౌళితో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మహేష్ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. సో మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంఫర్ హిట్ కావాల్సిందే.

మహేష్ రాజమౌళి తో చేసే సినిమా ఎలా ఉంటుందో తెలుసా….. ఎందుకంటే ఆ లైన్ కూడా చెప్పేసాడు మహేష్. రాజమౌళి తో కనుక నేను సినిమా చేస్తే ”మైథలాజికల్ ” బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తానని, ఆ సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఒక్క రాజమౌళి మాత్రమే నాకు కనిపిస్తున్నాడు అని చెప్పాడు మహేష్.

మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సి ఉండే కానీ అటు మహేష్ కు ఇటు రాజమౌళి కి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల వర్కౌట్ కాలేదు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక త్వరగా సినిమా రావాలనే ఆశతో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇక రికార్డులు ఆపతరమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -