Wednesday, May 22, 2024
- Advertisement -

నాని హీరోయిన్ ను పట్టిన విజయ్ దేవరకొండ

- Advertisement -

పెళ్లి చూపులు మూవీతో రాత్రి రాత్రికే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఓ మూవీ రిలీజ్ కు రెడీ కాగానే మరో మూవీన్ సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్.. బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో ఒక కొత్త మూవీని స్టార్ట్ చేశాడు. ఇది సెట్స్ మీద ఉండగానే.. ‘ది ఎండ్’ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైనా తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందని ఆలోచించిన దర్శక నిర్మాతలు మాళవికా నాయర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. నాని సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ తో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు విజయ్ సరసన నటించడానికి రెడీ అవుతోంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -