- Advertisement -

నిహారిక అదరగొట్టింది

- Advertisement -

కొణిదెల నిహారిక నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ్’ మంచి విజయం సాధించింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమెకు ఈ వెబ్ సిరీస్ మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. దీంతో పాటు నిహారికకు భారీగా అభిమానులు కూడా ఏర్పడ్డారు. గత వారం ఆమె తన ఫ్యాన్స్ తో ఫేస్ బుక్ ద్వారా లైవ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు.

నిహారిక అభిమానులు అడిగే వింత ప్రశ్నలు, అందుకు తగిన విధంగా ఆమె ఇచ్చిన సమాధానాలతో ఈ చిట్ చాట్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెను అభిమానులు చాలా అడిగారు. కొందరు ముద్దులు కూడా అడిగారు. దానికి నిహారిక చక్కగా సమాధానం ఇచ్చింది. నిహారిక త్వరలో ‘ఒక మనసు’ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది.

మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

{youtube}v=bhd_fd1tUbM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -