Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ సీఎం అవ‌డానికి కార‌నాలు ఇవే….

- Advertisement -

2019 ఎన్నిక‌లు ఏపీ ప్ర‌త‌యేక‌మ‌నే చెప్పాలి.అధికారంకోసం టీడీపీ,వైసీపీ,జ‌న‌సేన ,భాజాపా లు ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒక‌డుగు ముందుకేసి ఇప్పుడే ఎన్నిక‌ల స‌మ‌రానికి శంఖారావం పూరించారు.అధికార‌మే ల‌క్ష్యంగా పాద‌యాత్ర చేయ‌డంతోపాటు,ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.
వైసిపి అధినేత జగన్ ఇప్పటి వరకు ఎవరూ సాహసం చేయని పథకాలు ప్రకటించారు. జనాలను ఊరించే పథకాలు ప్రకటించారు. అమరావతిలో జరిగిన ప్లీనరీ వేదికగా 9 పథకాలను ఆయన ప్రకటించారు. వాటిని అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నరు. ప్లీనరీ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు జగన్.
మ్మ ఒడి ద్వారా 1నుంచి 5 వరకు చదివే పిల్లలకు ప్రతినెలా 500 రూపాయలు ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తామన్నారు. ఆరు. 6నుంచి 10వ తరగతి వరకు 750 రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకు జమ. ఇంటర్ విద్యార్థులకు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే వారికి వెయ్యి జమ చేస్తామన్నారు. ఆ పిల్లల తల్లి ఖాతాలో జమ చేస్తామన్నారు. మద్య నిషేధం విషయంలోనూ చాలా కీలకమైన ప్రకటన చేశారు జగన్. షాక్ కొట్టేలా మద్యం రేట్లు పెంచుతామన్నారు. కోటీశ్వరులకు మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
ఇవీ జగన్ అధికారం చేపట్టగానే అమలు చేసే 9 కార్యక్రమాలు
1. వైఎస్సాఆర్ రైతు భరోసా కార్యక్రమం.. రూ.50వేలు ఇస్తాం.
2. డ్వాక్రా మహిళలకు వైఎస్సాఱర్ ఆసరా.. ప్రస్తుత రుణాన్ని మాఫీచేస్తాం.
3. పెన్షన్లు.. రెండువేలు ఇస్తాం.
4. అమ్మ ఒడి… చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులిస్తాం.
5. హౌసింగ్ కార్యక్రమం.. ప్రతి పేదవాడికి ఇళ్ళు ఇస్తాం.
6. ఆరోగ్యశ్రీ.. అందరూ ఆరోగ్యం అందరికీ అందేలా చూస్తాం.
7.ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.
8. జలయజ్ఞం..రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం
9. దశల వారీగా మద్యపాన నిషేధం. భారీగా మద్యం ధరల పెంపు. మద్యం అందుబాటులో లేకుండా చేయడం.
జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను చూస్తె వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.భాజాపా-టీడీపీకూట‌మి,జ‌న‌సేన పార్టీలు అన్ని క‌ల‌సి వ‌చ్చినా జ‌గ‌న్ ఆకాంక్ష‌ను ఆప‌లేర‌ని విశ్లేష‌కులు అంనుకుంటున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -