సినిమా ఇండస్ట్రీ రంగురంగుల ప్రపంచం. అవకాశాలుంటే ఆకాశానికెత్తుతారు లేకుంటే కనీసం పలకరించే వారు కూడా ఉండరు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కర్లేదు. సినిమాలుంటే అగ్రహీరోయిన్స్ లేకుంటే ఐటమ్ సాంగ్స్ కూడా చేసేందుకు వెనుకాడరు. అయితే ఇదంతా కుర్ర హీరోయిన్స్ పాడే పాట్లు. కానీ అవకాశాల కోసం బోల్డ్ సీన్స్‌లో నటించడానికైనా వెనుకాడనంటోంది అలనాటి నటి మీనా.
బాలనటిగా కెరీర్ ప్రారంభించి సౌత్‌ని ఏలింది మీనా. తెలుగు,తమిళ్, మలయాళంలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత దృశ్యం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ఈ సిపిమాలో మీనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. రీసెంట్‌గా ఓ హిందీ వెబ్ సిరీస్‌కు సైన్ చేయగా దీనికోసం ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకుంటున్నారు.
ఇక అవకాశం ఉంటే బోల్డ్ సిరీస్‌లలో కూడా నటించేందుకు సిద్ధమని సన్నిహితులతో చెబుతుందట. తాను హీరోయిన్ గా నటించే సమయంలో కొన్ని బోల్డ్ పాత్రలు చేశాను. అయితే లేటు వయసులో ఘాటు పాత్రలను సౌత్ హీరోయిన్స్ చేయరు. కానీ నార్త్ లో చాలామంది చేస్తున్నారు. అందుకే, నార్త్ లో నేను ఎలాంటి బోల్డ్ రోల్స్ అయినా చేసేందుకు సిద్ధమని చెబుతుందట. అయితే మీనా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె ఫ్యాన్స్‌కు ఇబ్బందికలిగించే అంశమే.
