Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీకి దూరమవుతున్న సినిమా ఇండస్ట్రీ!

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి సినిమా ఇండస్ట్రీకి విడదీయరాని సంబంధం. టీడీపీ ప్రారంభించిన నాటి దగ్గరి నుండి చంద్రబాబు అరెస్ట్ వరకు ఎంతో మంది సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు పార్టీలో చేరారు. క్షేత్రస్ధాయిలో పనిచేశారు. ఎంతోమంది ఎంపీలు,ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా కనిపించడం లేదు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుండి ఒకరిద్దరు తప్ప ఎవరు ముందుకురావడం లేదు. ఒక్క రాఘవేంద్రరావు, నట్టి కుమార్ తప్ప ఇండస్ట్రీకి మద్దతుగా ఉన్న టీడీపీ నేతలు స్పందించడం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు మురళీ మోహన్. ఆయన సైతం బాబు అరెస్ట్ పై మాట్లాడటం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అరెస్ట్ గురించి తనకు అసలు తెలియనట్టుగానే వ్యవహారిస్తున్నారు.

ఇక తమిళ ఇండస్ట్రీ నుండి చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న రజనీకాంత్ స్పందించారు. నారా లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మనోనిబ్బరంతో ఉండాలని లోకేశ్ కు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుండి ఒక్కరూ కూడా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇండస్ట్రీ నుండి ఒక్కరూ కూడా స్పందించకపోవడానికి కారణం సీఎం జగన్ అంటే భయమేనట. జగన్ టార్గెట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర తమకు పుట్టగతులు ఉండవు అని రీల్ హీరోలుగా చెలామణి అయ్యే స్టార్స్ అంతా మెతక వైఖరిని అనుసరిస్తున్నారు. ఏదిఏమైనా సినీ గ్లామర్‌తో కళకళలాడే టీడీపీ ఇప్పుడు పూర్తిగా ఢీలా పడిపోయిందనే చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -