Wednesday, May 22, 2024
- Advertisement -

బాహుబలి లో మెగా హీరో..!

- Advertisement -

మీరు చదివింది నిజమే…. అన్ని అనుకున్నట్లు కుదిరితే బాహుబలి-2లో ఓ మెగా హీరో నటించే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ఓ కీలకమైన రోల్ కోసం ఎంపిక చేసే ప్రక్రియలో బాహుబలి టీం ఉంది. ఆ పాత్ర కోసం రాజమౌళి చాలామంది పేర్లను పరిశీలిస్తున్నాడు. పాత్ర కు చాలా ప్రాముఖ్యం ఉండడంతో పాటు…. సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్ కావడంతో స్టార్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజమౌళి.

ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్‌ ను తీసుకోవాడానికి ట్రై చేశాడు రాజమౌళి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా మెగా కాంపౌండ్ నుంచి ఓ స్టార్ హీరోను ఆ పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నాడట జక్కన్న. ఆ హీరో మరెవరో కాదు. అల్లు అర్జున్. అవును.. బాహుబలి-2లో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఇప్పుడు బన్నీ చెంతకు చేరింది. ఇప్పటికే క్యారెక్టర్ కు సంబంధించి జక్కన్న-బన్నీ మధ్య చర్చలు కూడా జరిగాయి. మరోవైపు బన్నీకి చాలా క్లోజ్ అయిన భళ్లాల దేవ (రానా) కూడా ఈ చర్చల్లో పాల్గున్నట్టు తెలుస్తోంది.

క్యారెక్టర్ బాగుంటే మరో హీరో సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పాడు. ఇందులో భాగంగానే బాహుబలి-2లో కూడా నటించడానికి బన్నీ ఒప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరో చేసిన ప్రకటన మాత్రం సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. సరైనోడు సినిమా విడుదలైన తర్వాత… అప్పుడే మల్టీస్టారర్లు చేయనని బన్నీ ప్రకటించాడు. సోలో గా నిరూపించుకున్న తర్వాతే మల్టీస్టారర్లు చేస్తానని చెప్పాడు. మరి రానా, ప్రభాస్ ఉన్న బాహుబలి-2లో బన్నీ నటిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అయినా బాహుబలి లాంటి సినిమాను మల్టీస్టారర్ మూవీ గా చూడకూడదని అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -