Friday, May 3, 2024
- Advertisement -

అంతా భ్రాంతిగా మిగిలిన టిమ్ కుక్

- Advertisement -

భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టి అంతకు మించి భారీ లాభాలు గడిద్దామనుకున్న ప్రముఖ ఐటి కంపెనీ ఆపిల్ సిఈవో టిమ్ కుక్ ఆశలు నీరుకారాయి. ఆయన ఆశించినట్లుగా ఇక్కడ పెట్టుబడులకు, కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దలు పెద్దగా ఆశక్తి చూపించలేదు. దీంతో భారత్ లో  ఏదో చేయాలని వచ్చిన కుక్ వ్యూహానికి గండి పడినట్లు అయ్యింది.

ఈమధ్యనే టిమ్ కుక్ భారత్ లో పర్యటించి ప్రధాని నరేంద్రమోదీని, ఇంకా ఇతర పారిశ్రామిక వేత్తలను కలుసుకున్నారు. ఇక్కడి ప్రారంభించాలనుకున్న రెండు ప్రాజెక్టులకు ప్రధానికి వివరించారు. అందులో ఒకటి వాడేసిన ఫోన్లను ఆధునీకరించి తిరిగి విక్రయించడం. ఇది అంత మంచిది కాదని, దీని కారణంగా ఈ వేస్ట్ ను భారత్ లో డంప్ చేయడమేనని ప్రభుత్వం భావించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు నో చెప్పింది. ఇక కుక్ రెండో కల ఆపిల్ స్టోర్స్ అంశంపై కూడా వ్యతిరేకతే వచ్చింది.

ఇక్కడ సింగిల్ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం 30 శాతం పరికరాలను స్ధానిక పరిశ్రమల నుంచే తీసుకోవాలి. దీనిని సవరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఆపిల్ చేసే ఉత్పత్తులు ఎంతో నాణ్యమైనవని, అందుకని తమకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇవ్వాలని ఆపిల్ సిఈవో టిమ్ కుక్ కోరారు. అయితే కేంద్రం మాత్రం అంగీకరించలేదు. దీంతో కుక్ భారత్ పర్యటన నిరాశజనకంగా సాగిందనే చెప్పాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -