Sunday, April 28, 2024
- Advertisement -

చిరు.. బట్టలు చెప్పులకే 5 కోట్లు

- Advertisement -

చిరు రీ ఎంట్రీ ‘ఖైదీ నెంబర్ 150’ తో తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు తన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ను చిరు రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండటం విశేషం. స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్ర భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు కనిపించబోతుంటే.. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార లాంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషించబోతుండటం చూస్తుంటే సినిమా ఏ లెవెల్ లో తెరకెక్కబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈ నెపథ్యంలో ఈ మెగా సినిమాకు సంబంధించి మరో మెగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చారిత్రాత్మక చిత్రంలో చిరు ఆ కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించడానికి అద్భుతమైన లుక్ ను ప్రిపేర్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరు కాస్ట్యూమ్స్ మరియు చెప్పులు కోసమే భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారట.

దీనికోసం ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఇద్దరు ప్రముఖ డిజైనర్లను రప్పించగా.. వాళ్ళు కథలోని ఆయా సన్నివేశాలకు తగ్గట్లు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ, సూటయ్యే చెప్పులు రెడీ చేయిస్తున్నారట. అందుకు ఇప్పుడు మొత్తంగా ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలియడం షాకింగ్ న్యూస్ అనే అనాలి. కేవలం చెప్పులు, బట్టలు కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేయటం అంటే అది వేరే స్థాయికి వెళ్లిపోవడం ఖాయం. మరి ఇది నిజంగా నిజమైతే, చిరు ఆ కాస్ట్ లీ లుక్ తో ఆ టైమ్ లో స్వాతంత్య్ర సమరయోధుడిగా ఏ లెవెల్ లో అలరిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -