నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథతో వెండి తెరకు పరిచయమయిన బ్యూటీ మెహ్రీన్. తొలి సినిమాతోనే సక్సెస్ చవి చూసిన ఈ బ్యూటీ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి ఎఫ్2,ఎఫ్3లో హనీ ఇస్ ది బెస్ట్ అంటూ ఆడియన్స్ మనసు దొచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఎఫ్ 3 తర్వాత మరో సినిమాకు కమిట్ కాలేదు.
అయితే తాజాగా వెబ్ సిరీస్‌ల బాట పట్టింది మెహ్రీన్. ఇక వెబ్ సిరీస్‌లంటే తెలిసిందే కదా. నో మోర్ కట్స్. ఎలాంటి బూతులైనా, సెక్స్ సీన్స్ అయినా సెన్సార్ లేకపోవడంతో హీరోయిన్స్ కూడా రెచ్చిపోయి నటిస్తున్నారు. స్టార్ డమ్‌ని పక్కకు పెట్టి మరీ సెక్స్ సీన్స్‌లో హద్దులు దాటేస్తున్నారు. రీసెంట్‌గా తమన్న లస్ట్ స్టోరీస్‌లో బ్లూ ఫిల్మ్‌ను మించి నటించి విమర్శల పాలైంది. ఈ విషయంలో తమన్నానే తనకు ఆదర్శమంటూ రెచ్చిపోయింది మెహ్రీన్.

ప్రస్తుతం మెహ్రీన్..సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మెహ్రీన్‌పై కొన్ని బోల్డ్ సీన్లు ఉండగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. మెహ్రీన్ మరి ఘాటుగా రెచ్చిపోయింది ఈ సీన్లలో. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా మెహ్రీన్‌ను మాత్రం నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. అవకావాల కోసం ఇంతలా దిగజారాలా అని కామెంట్స్ చేస్తున్నారు.