Wednesday, May 22, 2024
- Advertisement -

మోక్ష‌జ్ఞ కోసం టాప్ డైరెక్టర్స్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్ష‌జ్ఞ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వాడానికి రెడీ అవుతున్నాడు. చాలా కాలం నుంచి మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మోక్ష‌జ్ఞ చేయబోయే సినిమా ప‌ట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వ‌యంగా ఇది వ‌ర‌కే బాలకృష్ణ చెప్పారు కూడా.. ఇప్పుడు ఇందుకోసం రంగం సిద్ధవవుతుంది.

మోక్ష‌జ్ఞ కోసం అద్భుతమైన కథలు రెడీ చెయమని టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ ని పుర‌మాయించారు బాల‌య్య‌. ఆ టాప్ డైరెక్టర్స్ లో ఇప్పుడు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌ను ముందు వరసలో వున్నారు. అయితే బోయపాటి మోక్ష‌జ్ఞ కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. మరో వైపు త్రివిక్రమ్ కూడా మోక్ష‌జ్ఞ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాట్లు తెలుస్తోంది.

అయితే మొదటి చిత్రంతోనే యాక్షన్ సినిమా కాకుండా ఈ మంచి లవ్ స్టోరితో మోక్ష‌జ్ఞ‌ని ఇంట్ర‌డ్యూస్ చేయాలి అనుంటే త్రివిక్ర‌మ్‌ అయితే బెస్ట్ అని బాలయ్యకు స‌న్నిహితులు చెప్తున్నారట. సో అందుకే..ఇప్పుడు బాలయ్య త్రివిక్ర‌మ్‌తోనూ చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకులు రెడీ చేసిన కథల్లో ఏదో ఒకటి ఖాయం చేసి ఈ ఏడాది చివరికల్లా బాలయ్య ఓ నిర్ణయానికి వస్తాడట. 2017 సమ్మర్లో మోక్ష‌జ్ఞ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరి డైరెక్టర్స్ లో మోక్ష‌జ్ఞ ఎవరితో చేసిన నంద‌మూరి ఫ్యాన్స్‌కి పండగే… పండగ!

{youtube}v=WdNZmGnyQIo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -