Monday, May 20, 2024
- Advertisement -

మహేష్‍ది భారీ బడ్జెట్ సినిమాట??

- Advertisement -

బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం ఎంటా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటివలే కోలివుడ్ టాప్ డైరెక్టర్ మూరగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. సూమారు 90 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెకించనున్నారు.

అయితే 90 కోట్లు అనగానే ఓ భారీ చిత్రం అని కంగారూ పడకండి. అసలు విషయం ఏంటాంటే… సినిమా తీయడానికి ఖర్చు కాదండి.. హీరోకి 28 కోట్లు, డైరెక్టర్ కి 20 కోట్లు, ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్న పరిణితీ చోప్రా కి 3.5 కోట్లతో భారీ బడ్జెటాంట. ఈ మొత్తం బడ్జెట్ లో సంగం హీరోకి, దర్శకుడికే పోతున్నాయి. మరి సినిమా హిట్ అయితే పర్వలేదు. కానీ ఒక వేళ ప్లాప్ అయితే నిర్మాతకి పెద్ద దెబ్బే. పైకి మాత్రం భారీ బడ్జెట్ అని చెప్పుతున్న సగం డబ్బులు హీరో దర్శకుడికే వేళ్లుతున్నాయి.

భారీ బడ్జెట్ సినిమా అంటే.. ఇదేనా?? భారీ బడ్జెట్ అంటే మాములు గా చూసే ప్రేక్షకుడు మంచి లోకేషన్స్, సెట్స్, భారీ తరగణం, అన్ని ఉంటాయి అని ఆశపడుతాడు. కానీ ఇక్కడ చూస్తే సగం కన్న పైగా హీరోకి దర్శకుడికే ఖర్చుపెడుతుంటే.. మరి లోకెషన్స్, సెట్స్ కి ఏం ఖర్చుపెడుతారు.. ఇప్పుడు ఉన్న పరిస్థితులో 30 కోట్లు వస్తేనే.. ఎదోలా నిర్మాత గడ్డ ఎక్కినందుకు.. ప్రజలను ఆకర్శించేందుకు దొంగలెక్కలు చూపించి 60 కోట్లు వచ్చాయి అని డబ్బ కోట్టుకుంటున్నారు. మహేష్, మూరగదాస్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోని చేస్తున్న సినిమా.. మరి ఏ రెంజ్ లో ఆడుతుందో చూడాలి. ఆడితే నిర్మాతకి డబ్బే డబ్బు.. ఆడకపోతనే మరి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -