Wednesday, May 15, 2024
- Advertisement -

కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

తెలంగాణలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నించాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో తమ పార్టీకి స్వల్ప మెజార్టీయే వచ్చిందని, దీన్ని ఆసరాగా చేసుకుని తమ ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందంటూ రాష్ట్రపతి పాలన తీసుకువచ్చేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆయన అన్నారు. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇతోధికంగా సాయమందించాలనుకుందని ఆయన విమర్శించారు.

అయితే తమ ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కుట్రను మధ‌్యలోనే వదిలేశారని సిఎం కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి, వినోద్, వివేక్ తో పాటు సిపిఐ చెందిన ఎమ్మెల్యే రవీంద్ర తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కెసిఆర్ అనంతరం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ కవచం వంటిదని, ఈ రాష్ట్రాన్ని, తమ పార్టీని ఎవ్వరూ ఏమి చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తమ పార్టీలోకి కొందరు నాయకులకు కంటగింపుగా ఉందని, మరి వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలోకి మారితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -