Sunday, May 12, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు..

- Advertisement -

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంత. అక్టోబర్ 6, 7 తేదీల్లో వీళ్ల వివాహం జరగనుంది. వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖ సిద్ధమైంది. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-శామ్ ల పెళ్లి జరగనుంది. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు.

పెళ్లికి సంబంధించి పరిశ్రమలోకి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందుతున్నాయి. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు పూర్తిస్థాయిలో సినీ-రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు.

అయితే చైతూ, సమంత శుభలేఖ అంటూ సోషల్‌మీడియాలో ఓ కార్డు చక్కర్లు కొడుతోంది. చైతూ, సామ్‌, వీరి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఈ పెళ్లిపత్రికను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. గోవా వగేటర్‌ బీచ్‌లోని ది డబ్ల్యూ హోటల్‌లో ఈ శుభకార్యం జరగనున్నట్లు పత్రికలో పేర్కొన్నారు. అయితే ఇది నిజమైన పెళ్లిపత్రికా? కాదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

జనవరిలో చైతూ, సామ్‌ నిశ్చితార్థం వేడుక కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’లో నటిస్తున్నారు. దీంతోపాటు ఆమె ‘సావిత్రి’, విజయ్‌ 61వ చిత్రంలో నటిస్తున్నారు. చైతూ ‘యుద్ధం శరణం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత నుంచి షూటింగ్‌కు హాజరుకానున్నట్లు సమంత ఇటీవల పేర్కొన్నారు.ఇప్పుడిదే సోషియ‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -