Thursday, May 16, 2024
- Advertisement -

బాబులో మొద‌ల‌యిన అల‌జ‌డి….

- Advertisement -

ఏపీలో చంద్ర‌బాబు ప్రోత్స‌హించిన పిరాయింపులు సెగతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త‌నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంతో…సొంత‌పార్టీ సీనియ‌ర్‌నేత‌లు పార్టీకి దూర‌మ‌వుతున్నారు. ఇదే బాబును క‌ల‌వ‌ర పెడుతున్న ఆంశం.ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌లో పిరాయింపు నేత‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో పార్టీలో ముస‌లం మొద‌ల‌య్యింది.

తెలంగాణాలో టీడీపీ ఉందో లేదో తెలియ‌దుగాని …ఏపీలో మాత్రం ప్ర‌తిప‌క్షం ఉంద‌నేది ప్ర‌జ‌ల‌కు తెలుసు. అస‌లు ప్ర‌తిప‌క్షాన్నె లేకుండా చేయాల‌ని దుష్ట ఆలోచ‌న చేసిన బాబుకు ఇప్పుడు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వుల ఆశ‌లు చూపించి సీనియ‌ర్ల‌కు మొండిచేయి చూప‌డంతో …అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌ను బుజ్జ‌గించారు. కాని వారితో నిరంత‌రం బాబుకు త‌ల‌నొప్పిగా ఉంది.

పార్టీలో నాయ‌కుల‌కు ప్రాధాన్య‌త త‌గ్గ‌డంతో న‌లుగురు ఎమ్మెల్సీలు వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నారు.అద్దంకి నియేజ‌క‌వ‌ర్గ టికెట్ విష‌యంలో క‌ర‌నం బ‌ల‌రాం జ‌గ‌న్‌లో మంత‌నాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన వాకాటి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌న‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో …సీనియ‌ర్‌నేత రామ‌సుబ్బారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చినా స్థానిక నేత‌లు మాత్రం ఆదిపై కోపంగా ఉన్నారు.ఆయ‌న కూడా వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ర‌నె ప్ర‌చారం సాగుతోంది.

అనంత‌పురం ఎంపీ జేసీ అల్లుడు దీప‌క్ రెడ్డిని …టీడీపీ స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.ఆయ‌న బాబుపై కోపంగా ఉన్నారంట‌. కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు.2019 ఎన్నిక‌ల్లో వైసీపీ తీర్థంపుచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారంట‌.దీంతో న‌లుగురు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు రెడీగా ఉన్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -