Wednesday, May 15, 2024
- Advertisement -

నాగబాబు ఎందుకు వెళ్లలేదో మరి!

- Advertisement -

ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి నోట విన్నా.. సర్దార్ గబ్బర్ సింగ్ గురించే చర్చ వినిపిస్తోంది. ఈ ఆడియో ఫంక్షన్ విశేషాలపై.. కథలు కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. మెగా బ్రదర్ నాగబాబు.. వేడుకకు హాజరు కాకపోవడం.. చాలా మందిలో కొత్త అనుమానాలకు కారణమవుతోంది.

రీసెంట్ గా.. పవన్ ఫ్యాన్స్ పై నోరు పారేసుకున్న నాగబాబు.. ఈ వేడుకకు వస్తే కాస్త వేడి తగ్గి.. మళ్లీ మెగా ఫ్యాన్స్ లో యూనిటీ కనిపించి ఉండేదని చాలా మంది అంటున్నారు. కానీ.. నాగబాబు మిస్పింగ్ తో.. ఆ అవకాశం కోల్పోయిందని.. పైగా కొత్త అనుమానాలకు దారి తీసిందని విశ్లేషిస్తున్నారు.

నాగబాబు త్వరలోనే వైసీపీలో చేరతారని.. ఆయనకు కీలకమైన స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కాయమైందనీ వార్తలు రీసెంట్ గా వినిపించాయి. ఇలాంటి సందర్భంలో.. పవన్ తో ఎందుకు వేదిక పంచుకోవాలనుకోవడం అని నాగబాబు భావించే.. రిలీజ్ కు రాకపోయి ఉండొచ్చని కూడా గుసగుసలు నడుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -