Sunday, May 12, 2024
- Advertisement -

తమిళనాడులో బీజేపీ ఒంటరైపోయింది

- Advertisement -

నమ్ముకున్న వాళ్లు హ్యాండ్ ఇచ్చారు. కలిసి వస్తారనుకున్న వాళ్లు వీలు కాదన్నారు. చివరికి.. తమిళనాడు ఎన్నికల్లో కమలనాథులు ఒంటరి వారయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో.. కెప్టెన్ విజయకాంత్ పార్టీ డీఎండీకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. ఈ సారి కూడా ఆయనతో పొత్తుకు ఆరాటపడింది. కానీ.. పీపుల్స్ వెల్ ఫేర్ ఫ్రంట్ తో పొత్తు కుదుర్చుకుని.. తనే సీఎం అభ్యర్థిగా విజయకాంత్ ఎన్నికల బరిలో దూకుతున్నాడు.

ఇటు డీఎంకే కూడా.. కాంగ్రెస్ తో జట్టు కట్టడంతో.. చివరికి బీజేపీనే ఒంటరిగా మిగిలింది. అధికార పార్టీ అన్నాడీఎంతో శరత్ కుమార్ పార్టీ కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంది. ఇటు డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. అటు.. డీఎండీకే కు.. పీడబ్ల్యూఎఫ్ కు మొన్నే ఒప్పందం కుదిరింది.

ఇలాంటి పరిస్థితుల్లో.. ఒంటరిగానే బలం చూపించుకునేందుకు తమిళనాడులో సిద్ధమైంది.. భారతీయ జనతా పార్టీ. అయితే.. అస్సాంలో తప్ప.. మిగతా చోట్ల బీజేపీ నాయకత్వానికి నమ్మకం లేదని.. అందుకే.. మోడీ, అమిత్ షా లాంటి నేతలు ఇటు వైపు చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -