Tuesday, April 30, 2024
- Advertisement -

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. దేశంలో అతి పెద్ద ప్రమాదం ఇదే

- Advertisement -

ఒడిశాలో అర్థరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు తమ ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రమాదం మరింత దారుణంగా మారింది. ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు 233 మంది మృతి చెందారు. మూడు రైళ్లు ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. అర్థరాత్రి ఈ ఘటన జరగడంతో చాలా ఆలస్యంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.మృతుల సంఖ్య పెరగొచ్చని చెబు తున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. అయితే ఈ ప్రమాదం దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదంగా తెలుస్తోంది. ఇంతటి భారీ స్థాయిలో ఎప్పుడు కూడా రైలు ప్రమాదాలు జరగలేదని రైల్వేశాఖ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -