న‌మితను తీవ్ర వేధిస్తున్న ఇంటి యజమాని.. ఎందుకంటే..?

namita serious assaults

నందమూరి హీరో బాల‌కృష్ణతో సింహ సినిమాలో నటించి హాట్ సోయ‌గాల చూపించిన న‌మిత‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కి మ‌ర‌చిపోరు. త‌న హాట్ అందాల‌ను ఆర‌బోసేందుకు ఎంత‌మాత్రం ఇబ్బందిపడని ఈ ముద్దుగుమ్మకు తాజాగా వేధింపులు త‌గిలాయ‌ట‌.

అదేంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ హాట్ హీరోయిన్కే వేధింపులా..? అసలు నమితను వేధించింది ఎవరు..? అని షాక్ అవుతున్నారా..? అయితే అసలు విషయంలో కి వెళ్లాల్సిందే. తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి నమితకు.. ఆమె అద్దెకు నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయ‌ట. అది అస‌లు విషయం.

ఈ ముద్దుగుమ్మను కొంత కాలంగా ఇంటి యజమాని తనను వేధిస్తున్నాడని, గత ఏడాది డిసెంబరు 31 కల్లా కచ్చితంగా ఇంటిని ఖాళీ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించారు. తాను ప్ర‌తి నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా టైం టు టైం రూ.15000 చొప్పున అద్దె చెల్లిస్తున్నట్టు చెప్పారు. య‌జ‌మాని వేధింపుల‌పై ఈ మేరకు ఆమె స్థానిక 13వ అసిస్టెంట్‌ సిటీ సివిల్‌ కోర్ట్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. జడ్జి జీ శాంతి ఇరు పక్షాల వాదనలు విని.. ఈ నెల 12 వరకు నమిత ఆ ఇంట్లోనే ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

Related

  1. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత
  2. పవన్ ఎందుకు ఆనందంగా లేడో తెలుసా?
  3. పవన్ సరసన యాంకర్ అనసూయ!
  4. లైవ్ లో కంటతడి పెట్టిన సప్తగిరి.. కారణం ఇదే!