ప్రస్తుతం వస్తున్న సినిమా రివ్యూలపై ఆయా సినిమాల హీరోలు, దర్శకులు, నిర్మాతలు విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సినిమాలపై తమకు నచ్చినట్లు రివ్యూలు రాస్తుంటారని.. సినిమాలపై నాలెడ్జ్ ఉంటే వారినే సినిమాలు తియ్యమనండి.. అని సినిమా మేకర్స్ ఆయా రివ్యూ రైటర్స్ పై ధ్వజమెత్తుతుంటారు. అయితే రీసెంట్‍గా రివ్యూలపై సప్తగిరి హీరో స్పందించాడు.
హీరోగా మారిన హాస్యనటుడు సప్తగిరి “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా గతవారం విడుదలై విజయవంతగా నడుస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో సప్తగిరి కంటతడి పెట్టుకున్నాడు. దానికి కారణం… నెగిటివ్ గా రాసిన సినిమా రివ్యూలట!! అవును… తామంత ఎంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు మాత్రం నెగిటివ్ గా రాశారని చెబుతూ ఆ సమయంలో సప్తగిరి కంటతడి పెట్టుకున్నారు!
అనంతరం… హీరోగా తాను చేసిన తొలిసినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదలు చెప్పాదు. అలాగే.. దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఫైనల్ గా నటుడిని అయ్యానని అయినా సరే ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానని సప్తగిరి స్పష్టంచేశాడు. ఈ చిత్రం కలెక్షన్స్ పై మాట్లాడిన నిర్మాత రవికిరణ్.. ఈ సినిమాకి రివ్యూలు అటు ఇటుగా వచ్చిన కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి అని అన్నారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఆయన తెలిపారు.
Related