Sunday, May 5, 2024
- Advertisement -

నష్ట పరిహారం కోసం రైతుల ఆత్మహత్యలు ?

- Advertisement -

తెలంగాణా లో రైతుల ఆత్మహత్య లు దారుణంగా రోజు రోజు కీ పెరుగుతున్నాయి, తెరాస నాయకులు ఈ విషయం లో తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అనే ఆలోచన తో ఉన్నారు.

చనిపోయిన రైతుల కుటుంబాలకి పరిహారం చెయ్యడం లో తెరాస గట్టిగా స్పందిస్తోంది కానీ ఇచ్చే పరిహారాన్ని లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచిన తర్వాత నుంచి తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారని తెలుస్తోంది. పరిహారం పెంచక ముందు జరిగిన ఆత్మహత్యలూ తరవాత జరిగిన ఆత్మహత్యలూ పరిగణలోకి తీసుకుంటే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజుల వ్యవధి లో రోజుకి పదిమంది బలవంతంగా మరణించడం తీవ్రంగా కలచి వేస్తున్న విషయం. ఇలాంటివి అప్పట్లో టీడీపీ హయాం లో ఉండగా కూడా జరిగాయి.

అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే బహిరంగంగా చేసి దెబ్బ తిన్నారు . ” పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అని అనేసి సంచలన రేపారు. కానీ ఇప్పుడు ఆంధ్రా లో కూడా రైతుల నష్ట పరిహారం లక్షన్నర నుంచి ఐదు లక్షలు పెరిగింది కానీ దీని వలన సూసైడ్ ల లిస్టు పెరగలేదు సరికాదా తగ్గాయి అంటున్నారు. కానీ రోజుకు పది మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నా..

ఇప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి ఒక్క సానుభూతి మాట కరువైంది. హరీశ్ రావు తప్ప ఎవ్వరూ ఈ విషయం లో నోరు విప్పడం లేదు. రైతులకి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం లోలోపాలో, బహిరంగంగా నో నష్ట పరిహారం కోసం రైతులు చనిపోతున్నారు అనుకోవడం బాధాకరం, సిగ్గు చేటు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -