- Advertisement -
టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో పర్యటిస్తున్నారు.. పర్యటనలో భాగంగా నేడు షిప్ మార్కెట్ ను పరిశీలిస్తున్నారు.
చంద్రబాబు పర్యటిస్తుండగా, ఒక మత్సకారుడు తను డిఎస్‌సి క్వాలిఫై అయినా ఉద్యోగం లేదని నిలదీశాడు అని సమాచారం.. ఉద్యోగం లేక పూట గడావడానికి కూడా కష్టంగా అవుతోందని చంద్రబాబుతో తన గోడు వెలుబుచ్చుకున్నాడు.
దీంతో కంగుతిన్న చంద్రబాబు ఆ యువకుడికి నాలుగు మాటలు చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం.
చంద్రబాబు విశాఖలో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అల్లిపురంలో అపరిశుభ్రతపై ఆయన అసహానం వ్యక్తం చేశారు.
