Monday, May 6, 2024
- Advertisement -

Nani:మృణాల్‌తో లిప్‌లాక్..రెచ్చిపోయిన నాని

- Advertisement -

ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హాయ్ నాన్న. నాని సరసన మృణాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శౌర్యవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. అయితే టీజర్‌ని బట్టి చూస్తే నాని గత సినిమాలకు భిన్నంగా లిప్‌ కిస్‌లో రెచ్చిపోయారు.

మృణాలతో నాని కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా ఉండగా టీజర్ లో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కంటే…నాని, మృణాల్ మధ్య ప్రేమ, రొమాన్స్ నే ఎక్కువ చూపించారు. తొలుత క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే క్రిస్మస్‌కే ప్రభాస్ సలార్ వస్తుండటంతో నాని సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అనే సందేహం వ్యక్తం కాగా అన్నట్లుగానే రిలీజ్ డేట్ చేంజ్ చేశారు. అనుకున్న టైం కంటే ముందుగానే అంటే డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక నాని కెరీర్‌లో ఇది 30వ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -