Saturday, May 4, 2024
- Advertisement -

టీచర్‌గా మారిన సీఎం కేసీఆర్..

- Advertisement -

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గేర్ మార్చారు. నేటి నుండి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండగా తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులు, అసెంబ్లీ ఇంఛార్జీలతో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ పద్దతిలో పూర్తిగా మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం అంటే నవ్వులు, ప్రత్యర్థులపై చురకలు, పేరు చెప్పకుండానే ఇతర పార్టీల నాయకుల పరువు తీస్తారు.

అయితే తాజాగా పార్టీ అభ్యర్థులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ టీచర్‌గా మారారనే చెప్పాలి. ఓ కొడుక్కి నాన్న చెప్పినట్లు….ఓ టీచర్ స్టూడెంట్‌కి చెప్పినట్లు ఎన్నికల నామినేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని తమకే తెలుసనే భావనలో ఉండొద్దని ప్రతీ ఎన్నికకు రూల్స్ మారుతున్నాయని వాటిని తెలుసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో కొంతమంది పార్టీ అభ్యర్థులు చేసిన తప్పుల వల్ల
న్యాయస్థానాల్లో విచిత్రమైన తీర్పులు వస్తున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వనమా నాగేశ్వరరావు విషయాలను ప్రస్తావించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని బీఆర్ఎస్ లీగల్‌ టీంను సంప్రదించాలన్నారు. ముందుగానే బీ ఫాం ఇస్తున్నాం…జాగ్రత్తగా నింపాలని సూచించారు.

బీ ఫామ్స్ తప్పుగా నింపకండి …సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఎందుకంటే 30 వేల ఓట్లతో ఓడిపోయిన వారిని న్యాయస్థానాలు ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తున్నాయని …అందుకే ఎలాంటి పొరపాట్లు జరగకూడదని చెప్పారు. ఇక అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కోపతాపాలకు పోవద్దన్నారు. ప్రతి కార్యకర్తను కలవాలని…ఎట్టి పరిస్థితుల్లో తొందరపడొద్దన్నారు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఓపికగా ఉండాలని ప్రజలు అంతా గమనిస్తారని దిశానిర్దేశం చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఇవాళ చేసిన స్పీచ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -