Friday, March 29, 2024
- Advertisement -

సీనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో న్యాచుర‌ల్ స్టార్‌

- Advertisement -

అల‌నాటి సావిత్రి జీవిత‌చ‌రిత్ర నేప‌థ్యంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ పేరుతో సావిత్రి జీవితం తెరకెక్కుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ఇప్పటికే జెమినీ గణేశన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావు పాత్ర కోసం మోహన్‌బాబు, దర్శకుడు కెవి. రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్‌, సింగీతం శ్రీనివాస రావుగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి వారిని ఎంపికచేశారు. అయితే ఇప్పుడు సీనియ‌ర్ నంద‌మూరి తార‌క రామారావు (ఎన్టీఆర్) పాత్ర‌లో ఎంపిక‌య్యింద‌ని ఎవ‌రో తెలుస్తే షాక‌వ్వాల్సిందే.

దర్శక, నిర్మాతలు ఎన్టీఆర్ పాత్ర కోసం న్యాచుర‌ల్ స్టార్ నానిని సంప్రదించారంట‌. మరి నాని ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటారా లేదో చూడాలి. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, షాలిని పాండే త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మార్చి 29వ తేదీన వివిధ‌ భాషల్లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -