Friday, May 3, 2024
- Advertisement -

నాని డబుల్ ధమాకా అంటా!

- Advertisement -

వరస విజయలతో నాని దూసుకపోతున్నాడు. ఈ వారం రిలీజ్ అయిన “కృష్ణగాడి వీర ప్రేమ గాధ”తో మరో హిట్ తన ఖాతలో వేసుకున్నాడు. ఈ సినిమాకి ఇప్పుడు మంచి కలక్షన్స్‌ వస్తున్నాయి. వరస విజయలు రావడంతో నాని రెంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు నాని ఇంకో సినిమాకి రెడి అయ్యాడు.

ఈ సారి ఆయన డ్యూయిల్ రోల్ తో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. తనను “అష్టాచెమ్మా” వంటి చిత్రంతో పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయబోతున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు నెలల పాటు షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నాని సరసన నివేద ధామస్, సురభి హీరోయిన్స్ నటిస్తున్నారట.

ఈ “ధమాకా” చిత్రం నాని డ్యూయిల్ రోల్స్‌ పై వచ్చే కథ డిఫరెంట్ గా ఉంటుందట. అల్లరి నరేష్ తో తీసిన బందిపోటు సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ సినిమా కూడా మంచి లవ్‍తో పాటు ఫుల్ గా కామెడి కూడా ఉంటుందని చెపుతున్నారు. సో నాని ఈ సారి డబుల్ ధమాకా ఇవ్వబోతునున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -