Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడట ఎందుకంటే?

- Advertisement -

నాన్నకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్ యాభై కోట్ల క్లబ్ లో చేరారని ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే ట్రేడ్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే ఫ్లాఫ్, జస్ట్ ఓకే, యావరేజ్ అని తేల్చి చెప్తున్నారు. ఈ చిత్రం ఓవర్ సీస్ లో పెద్ద హిట్ అయ్యింది. కానీ ఇక్కడ మాత్రం యావరేజ్ రిజల్ట్ వచ్చింది.

అయితే ఎన్టీఆర్ కు మాత్రం ఈ సినిమా అద్బుతంగా నచ్చిందట. ముఖ్యంగా ఆయన ఈ సినిమాని తన హృదయానికి దగ్గరగా ఉన్న సినిమాగా ఫీలయ్యారు. అలాగే ఈ చిత్రం కన్నా అదే సమయంలో రిలీజ్ అయిన ఇంత కన్నా తక్కువ బడ్జెట్ తో రెడీ అయిన సోగ్గాడే చిన్ని నాయినా హై సక్సెస్ ఫుల్ మూవీ గా నమోదు చేసింది.

అలాగే శర్వానంద్..ఎక్సప్రెస్ రాజా చిత్రం సైతం సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చిపెట్టింది. ఐతే నాన్నకు ప్రేమతో చిత్రం కథనం పరంగా అద్భుతంగా ఉన్న ఒకేసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల అందులోను సంక్రాంతికి ఎక్కువగా ఫ్యామీల్స్ సోగ్గాడే చిన్ని నాయినా, ఎక్సప్రెస్ రాజా చిత్రలపై మొగ్గు చూపడం వల్ల నాన్నకు ప్రేమతోకు కొంత నష్టం జరిగిందని అనుకుంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -