Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రికార్డు కొట్టలేక పోతున్న పవన్ , మహేష్ !

- Advertisement -

టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ని మార్చేసింది అని చెప్పాలి. అప్పట్లో అసలు కొత్తదనం అంటే తెలీని ఎన్టీఆర్ టెంపర్ దెబ్బతో సూపర్ హిట్ కొట్టి తన ఆహార్యం తో పాటు , బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాతో అయితే తన లుక్ ని పూర్తిగా మర్చేసుకున్న బుడ్డోడు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కుమ్మేసాడు.

ఎన్టీఆర్ సినిమాలకి సోషల్ మీడియా లో ఒకప్పుడు పెద్ద సపోర్ట్ ఒచ్చేది కాదు గానీ నాన్నకు ప్రేమతో మాత్రం దానికి భిన్నంగా మారింది. టాలీవుడ్ లో పోస్టర్ నుంచీ ట్రైలర్ వరకూ అన్నీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో ట్రైలర్ + టీజర్ కి నాలుగు మిలియన్ వ్యూస్ రాగా ఇది టాప్ ప్లేస్ లో ఉంది.

ఈ రికార్డు ని సర్దార్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుంది అనుకున్నారు కానీ ట్రైలర్ లేట్ గా విడుదల అవ్వడం వలన ఇది సాధ్యం కాలేదు.సమ్మర్ లో ఒచ్చే బ్రహ్మోత్సవం కూడా క్రాస్ చేసే ఛాన్స్ లేదు అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ మళ్ళీ తన రికార్డుని తానే జనతా గ్యారేజ్ తో క్రాస్ చెయ్యాలి ఏమో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -