Wednesday, May 22, 2024
- Advertisement -

సర్దార్ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ అదే ..

- Advertisement -

టాలీవుడ్ హీరోలలో అందరు పెద్ద హీరోలూ చేసే తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడు అని ఫాన్స్ సీరియస్ అవుతున్నారు. భారీ లెంత్ తో సినిమా అంటా తీయడం సినిమా విడుదలకి ముందర నెగెటివ్ టాక్ ఒస్తుంది ఏమో అని కోసేయ్యడం , అయినా రన్ టైం ఎక్కువగా ఉండడం దాంతో ప్లాప్ అవ్వడం జరుగుతున్నాయి.

ఆగడు, 1 నేనొక్కడినే, బ్రూస్ లీ లాంటి ఎన్ని సినిమాలు ఫ్లాఫ్ అవుతూ వస్తున్న రన్ టైంని తక్కువగా చెయ్యడానికి చూస్తున్నారు. తప్పాదు అనుకుంటే గానీ భారీ లెంత్ తో సినిమా విడుదల చెయ్యడం లేదు మనవాళ్ళు. 2002 లో జానీ సినిమాని డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మూడు గంటల రన్ టైం పెట్టేసాడు ఏకంగా. అది అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కి ఒకరకంగా డైరెక్టర్ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు మూడు గంటల పది నిమిషాల రన్ టైం తో ఎడిటింగ్ టేబుల్ మీద సినిమాని పెట్టాడట. ఏ సీన్లు కట్ చేయించాలో తెలియక సినిమా లెంత్ ను ఇలాగే ఉంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రన్ టైం ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుందో సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది. ఏదైనా తేడా జరిగితే మాత్రం ఈ సినిమాకి రన్ టైం అతిపెద్ద మైనస్ అవుతుంది అని అంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -