తేజ మూవీలో హీరోగా చేస్తే.. ఆ తర్వాత హీరోగా కెరీర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఇస్తుంది గోపిచంద్ కెరీర్. గోపిచంద్ మొదట్లో హీరోగా చేసిన.. అప్పటికి అవేం పెద్ద హిట్ సినిమాలు కాలేకపోయాయి. ఆ తర్వాత తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీలో విలన్ గా చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత విలన్ గా చెసి.. ‘యజ్ఞం’తో మళ్లీ హీరో అయ్యాడు. మళ్లీ గోపి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
యాక్షన్ హీరోగా వరస సక్సెస్ లను అందుకున్నాడు హీరోగా నిలదొక్కుకున్నాడు. మరి ఇప్పుడు నారా రోహిత్ కెరీర్ కూడా అలాగే మలుపు తిరుగుతుందేమో చూడాలి. ఎందుకంటే.. ఇతడు కూడా తేజ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నారా రోహిత్ విలన్ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఒక వైపు ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందిస్తూ.. మరో వైపు వెంకీతో కూడా సినిమా చేస్తానని అంటున్నాడు తేజ. అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. నటీనటుల ఎంపిక జరుగుతుందని సమాచారం. విలన్ గా నారా రోహిత్ ను ఎంచుకున్నారట.
ఇందుకు సంబంధి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నారా రోహిత్ చాలా కాలం నుంచి హీరోగా వరస దండయాత్రలు చేస్తున్నాడు. సోలో, రౌడీ ఫెలో వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించాడు. అయితే తర్వాత వరసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. హీరోగా ఇతడికి సరైన హిట్ దక్కలేదు ఇంత వరకూ. మరి తేజతో సినిమా ద్వారా ఇతడి కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి.
