Sunday, April 28, 2024
- Advertisement -

పాదయాత్రను అడ్డుకునేందుకే అసెంబ్లీ… ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటే వైసీపీ అసెంబ్లీకి

- Advertisement -

వచ్చే నెల 8వ, తేది నుండి ప్రారంభం కానున్న ఏపీ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకొంది. ఈ స‌మావేశాల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ హాజ‌ర‌వుతుందాలేదా అన్న అనుమానాలు మొద‌ల‌య్యియి. ముందునుంచి స‌మావేశాల‌కు హ‌జ‌ర‌వ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యంపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వినిపిండానికి వేదిక అసెంబ్లీనేన‌ని దానికి హాజ‌ర‌వ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెల్తాయ‌ని కొంద‌రు నాయ‌కులు సూచించారు.

అయితె చివ‌రికి అసెంబ్లీ స‌మావేశాల‌ను బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, లోటస్ పాండ్ లో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరుగగా, జగన్ సహా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తాజారాజ‌కీయ ప‌రిస్థితులు, నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రలపై చర్చించారు.

జగన్ పాదయాత్రను తలపెట్టిన తరువాత, దాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పలువురు నేతలు ఆరోపించారు. పాదయాత్ర తేదీలను ముందుగా చెబుతున్నామని, నవంబర్ లోగా శీతాకాల సమావేశాలను ముగించే అవకాశాలున్నా, తెలుగుదేశం పట్టించుకోలేదని వైకాపా ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం జగన్ తలపెట్టిన పాదయాత్రకే ప్రాథాన్యం ఇవ్వాలని అత్యధిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడటంతో ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది..

పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ కోడెల విఫలమయ్యారని ఆపార్టీ నేత పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. పైగా వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆయన విమర్శించారు. టీడీపీలోకి ఫిరాయించిన 20 మందిపై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు నేతలు జగన్ ను కోరారు. ఆ 20 మందిపై చర్యలు తీసుకుంటే సభకు హాజరయ్యే అంశాన్ని ఆలోచిస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

https://www.youtube.com/watch?v=GZxUsvl2qUg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -