Sunday, May 19, 2024
- Advertisement -

చిరంజీవి తో నర్గీస్ రోమాన్స్ ..?

- Advertisement -

చిరంజీవి 150 సినిమా విషయంలో ఇంకా హీరోయిన్ సంగతి తేలట్లేదు. ఆయన సినిమాలో హీరోయిన్ అంటే ఎవరైనా ఎగిరి గంతేసి మరీ ఒప్పేసుకుంటారు కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా ఈ విషయం లో కంక్లూడ్ చెయ్యట్లేదు.

చిరంజీవి 150 కి అన్నీ కుదిరాయి కానీ హీరోయిన్ ఎవరు అన్నది తేలకపోవడం మెగా ఫాన్స్ కి ఇబ్బంది కలిగించే విషయం. నయనతార.. అనుష్క.. దీపికా పదుకొనే.. ఇలాంటి పేర్లు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి కానీ… వాళ్లలో ఎవ్వరూ ఈ సినిమాలో నటించట్లేదని తేలిపోయింది.

తాజాగా ఓ బాలీవుడ్ హాట్ హీరోయిన్ పేరు తెరమీదికి వచ్చింది. ఆమే.. నర్గీస్ ఫక్రి. రాక్ స్టార్ సినిమా లో తన అందాలతో, నటన తో సూపర్ రేంజ్ ని చూపించిన నర్గీస్ ఇప్పుడు చిరంజీవి పక్కన అంటే అదో రకంగా అనిపిస్తోంది.

ఏజ్ గ్యాప్ తో పాటు వీరిద్దరి మధ్యా జోడీ అంతగా బాగోదు అని అంటున్నారు ఫాన్స్ సైతం. చిరంజీవి ఎంత కాదు అనుకున్నా పాత తరం హీరో – నర్గీస్ మాత్రం కొత్త పిల్ల .. అడ్వాన్స్ మోడ్ లో ఉంటూ కొత్త కొత్త హీరోలతో చేసే పిల్ల. అజహర్ , హౌస్ ఫుల్ 3 లాంటి సినిమాలల్లో చేసిన ఆమెని చిరంజీవి పక్కన తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -