- Advertisement -

ఏడేళ్ల తర్వాత బాలయ్యతో నయన్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తదుపరి చిత్రం పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పనిచేయనున్నారు బాలయ్య. ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్‌గా NBK111 అని పెట్టారు.

ఈ సందర్భంగా మేకర్స్ హీరోయిన్‌ లుక్‌ని రివీల్ చేశారు. బాలకృష్ణతో నయనతార ఏడేళ్ల తర్వాత మళ్లీ జతకడుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం ఇది కావడం విశేషం. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటు, ఆమె ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రాయల్ క్వీన్‌గా కనిపించనున్నట్లు వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా థమన్ పనిచేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -