మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో హిడ్మా భార్య, మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ఆపరేషన్ కర్రెగుట్టల తర్వాత ఆంధ్రా-తెలంగాణ వైపు వచ్చింది హిడ్మా దళం.
హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డు, హిడ్మా భార్య హేమపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. హిడ్మా పూర్తి పేరు ‘మాద్వి హిడ్మా’ అలియాస్ సంతోష్. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించారు హిడ్మా. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు ఉంది.
హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు హిడ్మా. బస్తర్ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా… చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందారు హిడ్మా అలియాస్ సంతోష్. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా,దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా చేశారు.
