Thursday, May 23, 2024
- Advertisement -

ప్రభుదేవాతో మళ్లీ నయనతార ?

- Advertisement -

నయనతార గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయందే.. గాసిప్ రాజాలకు నిద్ర పట్టదనుకుంట. మొదట శింబూ, తర్వాత ప్రభుదేవాలతో లవ్ గేమ్ పూర్తయ్యాక.. పూర్తిగా సినిమాల గురించే ఆలోచిస్తున్న నయన్ పై.. ఇప్పటికే చాలా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.

కొన్నాళ్లు తమిళ్ హీరో ఆర్యాతో నయన్ లవ్ లో పడిందని వార్తలొచ్చాయి. త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్టు కూడా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు.. ఇలాంటిదే ఇంకో వార్త తమిళ్ సినిమా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో ఏవో గొడవలు ఉన్న కారణంగా… అపరిచితుడు విక్రమ్ తో నటించేది లేదని ఎప్పుడో నయన్ తార స్టేట్ మెంట్ ఇచ్చింది. కానీ.. అదంతా మరిచిపోయి విక్రమ్ తో జత కట్టేందుకు ఆమె ఓకే చెప్పేసిందని కోలీవుడ్ లేటెస్ట్ న్యూస్. 

ఇంతకుముందు ఇలాగే.. శింబుతో గతాన్ని మరిచిపోయిన నయనతార… ఓ సినిమాకు ఓకే చెప్పింది. ఇప్పుడు.. విక్రమ్ తో గతంలో పడిన గొడవలు మరిచిపోయి మరీ సినిమాకు రెడీ అయ్యింది. ఇంకేముంది… ప్రభుదేవాతో కూడా త్వరలోనే ఓ సినిమాలో యాక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని గుసగుసలు మొదలయ్యాయి.

ఈ కామెంట్లు నయనతార చెవిన పడ్డాయో లేదో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -