Friday, May 3, 2024
- Advertisement -

మంచి తల్లి కావాలనుందట

- Advertisement -

మన సినిమాల హీరోయిన్లు ఎప్పుడు ఎలా నిర్ణయాలు మార్చుకుంటారో ఎవరూ చెప్పలేరు. కనీసం ఊహించడానికి కూడా ట్రై చేయరు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంటరై.. ఇప్పుడు కోటిన్నర హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన శృతిహాసన్ ను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.

పెళ్లి కోరికే లేదు.. ఆ ఆలోచనే తన మనసులో లేదని గతంలో చాలాసార్లు ఓపెన్ గా చెప్పుకొచ్చిన శృతి.. ఇప్పుడు సడన్ గా నిర్ణయం మార్చుకుంది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. ఆదర్శ తల్లిని కావాలని ఉందంటూ.. ఓ కార్యక్రమంలో అంతే ఓపెన్ గా చెప్పేసింది.

తన అమ్మ సారికను చూస్తే గర్వంగా ఉంటుందని.. 20 ఏళ్ల క్రితమే జాతీయ ఉత్తమ నటి అయిన సారికలా ఎదగాలని అనుకుంటున్నట్టు శృతి చెప్పింది. తండ్రి కమల్ హాసన్ తో పాటు.. చెల్లెలు అక్షరతో కలిసి నటించాలన్న కోరిక కూడా ఉందంది. మరోవైపు.. పెళ్లిపై మనసుపడిన శృతిహాసన్.. అది ఎవరితో అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటి వరకు తనకు ఇండస్ట్రీలో ఎవరూ ప్రపోజ్ చేయలేదన్న శృతి హాసన్.. అన్నీ ఆలోచించుకున్నాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది. శృతి స్టేట్ మెంట్లు చూసి.. టాలెంట్ తో పాటు.. ఇంత గడుసు తనం ఉంది కాబట్టే టాప్ హీరోయిన్ గా ఎదగిందని అంతా అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -