Sunday, May 12, 2024
- Advertisement -

గెలుపెవరది?

- Advertisement -

 

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక పూర్తై రెండు రోజులు గడిచినా… ఆ వేడి మాత్రం నాయకులు, ప్రధాన పార్టీల్లో ఇంకా తగ్గలేదు. థ్రిల్లర్ సినిమాకు టెర్రిఫిక్ క్లైమాక్స్ లాంటి అసలైన ప్రజా తీర్పు ఏంటో.. మంగళవారం నాడు రివీల్ కానుండడంతో.. అభ్యర్థుల్లో ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతోంది.

అంచనాలు, లెక్కలు ఎక్కాల్లో పార్టీలు, కార్యకర్తలు మునిగిపోయాయి. భారీ మెజారిటీతో విజయం మళ్లీ తమదే అని అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటే.. అదే స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే.. ఓటింగ్ జరిగిన తీరు.. అభ్యర్థులపై ఓటర్లనుంచి వినిపించిన అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటే… మళ్లీ అధికార పార్టీ టీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తోంది.

అద్భుతం జరిగితే తప్ప.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు విజయం సాధించరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సారి గతంలో వచ్చినంత భారీ మెజారిటీ రాకున్నా… టీఆర్ఎస్ కు విజయంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీ రెండు, మూడు స్థానాల్లో నిలిచే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు కూడా చూపిస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు.. స్థానికేతరులు కావడం… సరిగ్గా నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఇంట్లో విషాదం… ఇటు బీజేపీ తరఫున ఇన్నాళ్లూ రాజకీయాల్లో లేని అభ్యర్థి బరిలో నిలవడం.. వీటికి తోడు.. అధికార పార్టీ అభ్యర్థి వస్తేనే… కేంద్రంలో వరంగల్ కోసం కష్టపడతాడని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం.. ఇలా ఒకటికి పది కారణాలు అధికార పార్టీకే అనుకూలంగా సంకేతాలు చూపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు.

ఈ అభిప్రాయాలు ఎంతవరకు నిజమవుతాయి? పోరుగల్లు బై పోలింగ్ లో అంతిమ విజయం ఎవరిదన్నదీ ఇంకొక్క రోజు ఓపిక పడితే తెలిసిపోనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -