Sunday, May 19, 2024
- Advertisement -

చిరు కోసం ఆ భామ భారీ డిమాండ్!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా చిరంజీవి 150వ చిత్రం. అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. తమిళంలో హిట్ అయిన కత్తి సినిమా ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు చిరు. ఇందుకు వినాయక్ చిరుకు తగ్గట్టు కథలో మార్పులు కూడా చేసాడట.

ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాబోతున్నారు. ఐతే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‍గా నయనతారను తీసుకున్నారు ఈ చిత్ర యూనిట్. ఇంక విలన్, తదితరులు నటులను తీసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఐతే ఈ సినిమా కోసం చిరు 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఐతే హీరోయిన్ నయనతార కూడా రెండున్నర కోట్లా రూపాయలు ఆశిస్తుందని తెలుస్తోంది.  ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌లో నయననే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. చిరు పక్కన నటిస్తుందని కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోపోతే ఎలా అంటున్నారు చిరు అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -