Sunday, April 28, 2024
- Advertisement -

నిహారిక సెకండ్ ఇన్నింగ్స్!

- Advertisement -

మెగా డాటర్ కొణిదెల నిహారిక సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. సినిమాలు ఆ తర్వాత పెళ్లి, బ్రేకప్ వెంట వెంటనే జరిగిపోగా ఇప్పుడు తాజాగా మళ్లీ తెరపై అలరించేందుకు సిద్ధమైంది. నిహారిక తన సెకండ్ ఇన్నింగ్స్‌ని బుల్లితెరపై ప్రారంభించనుంది.

ఆహాలో లాంఛ్ కాబోతున్న ఓ చాట్ షోతో నిహారిక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. చెఫ్ మంత్ర సీజన్ 3 ఆహాలో ప్రసారం కానుండగా మొదటి ఎపిసోడ్ మార్చి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఈ షో ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి.

చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ కాగా ఈ సీజన్‌ని వినోదంతో పాటు సెలెబ్రిటీలతో ఫన్నీ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక నిహారిక రీ ఎంట్రపై మెగా ప్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న అన్‌స్టాపబుల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -