Monday, April 29, 2024
- Advertisement -

43 కోసం కష్టపడుతున్న సూర్య!

- Advertisement -

దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య. పాత్ర ఏదైనా దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య తన 43వ సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లొకేషన్స్‌ కోసం హర్యానాలోని కొన్ని ప్రాంతాలను సెలక్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో సూర్య ఓ కాలేజ్ విద్యార్థిగా కనిపించనుండగా దీనికోసం బరువు కూడా తగ్గుతున్నాడు. ఇలా వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలిచే సూర్యకు సినిమాల పట్ల ఉన్న కమిట్‌మెంట్ తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కంగువా సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న సూర్య ఇది పూర్తయిన వెంటనే 43వ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

సుధా కొంగర -సూర్య కాంబోలో గతంలో వచ్చిన ‘సూరారై పొట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా పెద్ద హిట్ అయింది. ఐదు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. తాజాగా సుధా కొంగరతో మరోసారి సూర్య సినిమా వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -