Sunday, May 19, 2024
- Advertisement -

నందమూరి హీరో కోసం నిహారిక అంత పని చేసిందా?

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొణిదల కొంటె పిల్ల నిహారిక…. అతి తక్కువ కాలంలోనే బుల్లి తెరపై యాంకరింగ్ చేసిన ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. మెగాబ్రదర్ నాగబాబుకూతురు అయినప్పటికి ఆ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇప్పుడు.. వెబ్ సిరీస్ ‘ఆవకాయ ముద్దపప్పు’, గేమ్ షోస్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం నాగశౌర్య హీరోగారూపొందుతోన్న ‘ఒక మనస్సు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప్రేకకుల ముందుకు రాబోతోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై నిహారిక వల్ల భారీగానే అంచనాలుఏర్పడ్డాయి. ఈ మెగా డాటర్ ఏ మేరకు హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది.  తొలి చిత్రమే జూనియర్ కి వీరాభిమాని అయిన నాగ శౌర్యతో చేసిన ఈ చిన్నది ఇప్పుడు నందమూరి హీరోలతో స్నేహం చేయడానికి ఉవ్విల్లూరుతుంది.

అయితే దానికి తగ్గటే అమ్మడు ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అనేది అమ్మడి ఆలోచనలా ఉంది.తొలి చిత్రం విడుదల కానున్న తరుణంలో ఇది ఒక విదంగా ఆమె కెరీర్ కి ఉపయోగపడేలా ఉంది.తారక్ తో నటించడమే ద్యేయం అని చెప్పిన ఈ భామ ఇప్పుడు దాదాపుగా ఆ దిశగా అడుగులు వేస్తుంది..పూరి జగన్నాధ్-కళ్యాణ్ రామ్,మేహరీన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దాదాపుగా సగం పైనే పూర్తయ్యింది.

తన సినిమాలని త్వరగా లాగించేసే పూరి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసాడు.అయితే దీనికి నిహారికకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. నిహారిక ఇప్పుడు కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ మేహరీన్ కి తన గొంతుని అరువు ఇవ్వనుంది అంటే హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పనుంది. సో అది సంగతి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -