Tuesday, April 30, 2024
- Advertisement -

సావిత్రి మూవీ రివ్యూ

- Advertisement -

బాణం సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు నారా రోహిత్. వరస సినిమాలతో ఈ యూవ నటుడు దూసుకెల్తున్నాడు. రీసెంట్ గా తుంటరి అనే సినిమాని రిలీజ్ చేసిన రోహిత్ వేను వేంటనే ఈ రోజు సావిత్రి అనే సినిమాని రిలీజ్ అయింది.

మరి ఈ సినిమాలో నారా రోహిత్ సరసన నందిత జంటగా నటించింది. ట్రైలర్, పోస్టర్స్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా నారా రోహిత్ ఖాతాలో హిట్ గా చేరుతుందా లేదా అనేది చూద్దాం.

కథ:

సావిత్రి (నందిత) చిన్నప్పట్నుంచే పెళ్లి అంటే పిచ్చి ఉన్న అమ్మాయి. తన అక్క పెళ్లి ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్లి పోతుంటే తన వల్ల పడే మచ్చతో తన పెళ్లికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఆమెను పట్టించేసే స్థాయి ఉంటుంది ఆమె పెళ్లి పిచ్చి. ఇలాంటి అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు రిషి (నారా రోహిత్). ఐతే రిషి ఎంతగా వెంటపడ్డా సావిత్రి మాత్రం కరగదు. అప్పటికే తనకు ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని తెగేసి చెబుతుంది. ఐతే సావిత్రికి ఇంట్లో చూసిన అబ్బాయి రిషినే. కానీ ఈ సంగతి తెలియక సావిత్రి తండ్రిని వేరే సంబంధం చూసుకోమంటాడు రిషి. అసలు విషయం తెలిశాక సావిత్రి ఇంటికి వెళ్తే ఆమె తండ్రి అతణ్ని బయటికి గెంటేస్తాడు. సావిత్రి ఇంకో పెళ్లికి రెడీ అయిపోతుంది. ఈ స్థితిలో రిషి ఏం చేశాడు.. తను ప్రేమించిని అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

నారా రోహిత్ గత కొద్ది రోజులుగా ఏదో ఒకరకమైన పాత్రలోనే కనిపిస్తున్నాడు. దాదాపు సోలో తర్వాత మళ్ళీ అన్ని అంశాలు కలగలిపిన రిషి అనే పాత్రలో చాలా బాగా చేసాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలెమెంట్స్, కామెడీ, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లో ది బెస్ట్ అనిపించుకుని అందరినీ ఎంటర్టైన్ చేసాడు. కానీ కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడా అవసరానికి మించి చేసాడు అని చెప్పాలి. ఆ సీన్స్ లో కాస్త కంట్రోల్ గా చేసి ఉంటే బాగుండేది. ఇక నందిత సావిత్రి పాత్రలో బాగా చేసింది. ఎమోషన్స్ చూపడంలో, పెళ్లి పిచ్చి ఉన్న అమ్మాయిగా, కొన్ని సీన్స్ లో రెబల్ పాత్రలో బాగా చేసింది. కానీ ఆ పాత్రలో ఉండాల్సిన క్యూట్ నెస్ ని మాత్రం తన పాత్రలో చూపలేకపోయింది. ధన్య బాలకృష్ణ ఇప్పటి వరకూ కనిపించిన అన్ని సినిమాల కంటే బెస్ట్ గా కనిపించింది. అలాగే తన పెర్ఫార్మన్స్ కూడా సూపర్. కమెడియన్స్ గా ప్రభాస్ శ్రీను, పోసాని కృష్ణమురళి, సత్య బాగా నవ్వించారు. వీరి పాత్రలకు రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన వెన్నెల కిషోర్, మధు, శ్రీ ముఖిలు అతిధి పాత్రల్లో బాగా చేసారు. మురళి శర్మ, అజయ్ లు కీలక పాత్రల్లో కనిపించి హీరోయిజం ని ఎలివేట్ చేయడంలో సహాయపడ్డారు. రవిబాబు, జీవ మెయిన్ విలన్స్ గా బాగా చేసారు.  ప‌వ‌న్ సాధినేని దర్శకత్వం పరవలేదు.

శ్రవణ్ అందించిన మ్యూజిక్ లో పాటలు బాగున్నాయి. అవి విజువల్ గా ఇంకా సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఇక విజువల్స్ కి తన నేపధ్య సంగీతంతో జస్టిఫికేషన్ ఇచ్చాడు. ముఖ్యంగా హీరోయిజం ఎలివేషన్ సీన్స్ మరియు లవ్ సీన్స్ లో మ్యూజిక్ అదరగొట్టాడు. 

మైనస్పాయింట్స్

సావిత్రి సినిమాకు ప‌వ‌న్ సాధినేని తీసుకున్న క‌థలో కొత్త‌ద‌నం లేదు. అయితే క‌థ‌నంలో కూడా మ‌రీ మెస్మ‌రైజ్ చేయ‌క‌పోయినా వినోదంతో బండి నడిపించాడు. చివర్లో ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను క‌నెక్ట్ చేశాడు. న‌టీన‌టుల నుంచి మంచి యాక్టింగ్ రాబ‌ట్టాడు. సినిమా చూస్తున్నంత సేపు మ‌న‌కు కృష్ణ‌వంశీ మార్క్ అక్క‌డ‌క్క‌డా మెరుస్తుంటుంది. మాటల రచయిత కృష్ణచైతన్య నుంచి దర్శకుడికి పూర్తి సహకారం లభించింది. కామెడీ పంచ్ డైలాగులతో పాటు సెంటిమెంట్ డైలాగులను బాగా రాశారు. కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో లేక‌పోవ‌డం. సీన్ల మ‌ధ్య లింక్ లేక‌పోవ‌డం మైనస్పాయింట్స్.

మొత్తంగా:

కథలో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించవచ్చు. మైనస్పాయింట్స్ మినహాయిస్తే ‘సావిత్రి’ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -