రెండు కళ్ళ సిద్ధాంతం తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఒదిగింది ఏమీ లేదు కానీ ఆయన తీవ్రంగా నష్టపోతున్నారు. మరొక సారి ఆ విషయం నిరూపణ జరిగినట్టు అయింది. తన కారణంగా హైదరాబాద్ తెగ అభివృద్ధి చెందిందని చెప్పుకునే చంద్రబాబు.. అలాంటి హైదరాబాద్ లను తాను తయారు చేస్తానన్న ధీమాను వ్యక్తం చేసినా.. గడిచిన 22 నెలల కాలంలో ఆయనేమాత్రం చేశారో తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తన పట్టును రోజురోజుకీ పెంచుకోవటమే కాదు.. సాంతికేతికత సాయంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలతో హైటెక్ ముఖ్యమంత్రి అన్న భావన కలిగేలా చేయటం గమనార్హం.
హైటెక్ సిటీ ని అడ్డం పెట్టుకుని అంతా తానే చేసాను అని చెప్పుకునే చంద్రబాబు కాలాని తగ్గట్టుగా మారలేదు, ఇప్పుడు ఆ హైటెక్ త్యాగ ని కెసిఆర్ కి ఇచ్చేసే పరిస్థితి ఒచ్చేసింది. ఈ మధ్య కాలం లో కెసిఆర్ ఇచ్చిన ఇచ్చిన ప్రజంటేషన్ అదిరిపోవటమే కాదు.. ఈ తరహా ప్రయత్నం దేశంలోని మరే సీఎం చేయలేదన్న ఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఐటీ పాలసీ సందర్భంగా కూడా రోబో ని వినియోగించడం ఇలాంటివి అదుర్స్ అనిపిస్తున్నాయి . ఈ రకంగా కెసిఆర్ ఇప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి.
