Friday, May 17, 2024
- Advertisement -

నీహారికకి చాలా కష్టాలు వచ్చాయి!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక హీరోయిన్ గా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఒక మనసు చిత్రంలో నీహారిక హీరోయిన్‍గా నటిస్తోంది. అయితే మెగా హీరోల్లా నీహారికకు భారీ లాంఛ్ దొరకలేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద నిర్మాత దొరక్కపోవడంతో తనకి వచ్చిన ప్రాజెక్ట్‌నే ఓకే చేసింది.

అయితే దీని వల్ల నిహారికకు ఓ సమస్య వచ్చి పడింది. తన మొదటి చిత్రాన్నికి భారీ హైప్ తెచ్చేందుకు నీహారికా చాలా ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఇందులో హీరోగా నటిస్తున్న నాగశౌర్య వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే అతని సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడారు. ఆడియో వేడుకకి యువ మెగా హీరోలందరినీ పిలిచి ‘ఒక మనసు’ ఆడియో లాంఛ్‌ బ్రహ్మాండంగా చేసినా, అక్కడికి అతిథిగా వచ్చిన అల్లు అర్జున్‌ ఆ వేడుకని పక్క దారి పట్టించేసాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి తాను చేసిన ‘చెప్పను బ్రదర్‌’ కామెంట్స్‌కి వివరణ ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడ ‘ఒక మనసు’ ఆడియో కంటే తనే హైలైట్‌ అయ్యేట్టు చేసాడు. వచ్చే వారం విడుదలకి రెడీ అవుతున్న ‘ఒక మనసు’పై ఎక్కడా బజ్‌ లేదు. సో మొదటి చిత్రం ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలి అని నీహారిక చాలా కష్టాలు పడుతుందట. నీహారికనే ఒక మనసు ప్రమోట్‌ చేసుకోవడానికి చాలా పాట్లు పడుతోంది. మరి ఇంత కష్టపడుతున్న నీహారికకు ఒక మనసు చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -