Sunday, May 26, 2024
- Advertisement -

రూమర్స్ విని వారికి కోపం వచ్చింది!

- Advertisement -

కొత్త హీరో నటించిన మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో చాలా సంతోషపడ్డాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అని గాసిప్పులు వినిపించాయి. ఆ వార్త విని హీరో షాక్ అయ్యాడు. తొలి చిత్రాన్నికే ఇలాటి గాసిప్పులు ఏంటా అని అనుకున్నాడు. ఇక ఆ హీరో ఇంట్లో అయితే పెద్ద గోడవే.. అయితే ఎలాగోలా అది మరచిపోయి తన రెండో సినిమా తీశాడు. మళ్లీ సెమ్ అవే గుసగుసలు ఆ హీరో.. ఆ హీరోయిన్ అని.. రెండో సారి మళ్లీ ఆ హీరో ఇంట్లో డౌట్ పడ్డారు. ఇక మూడో చిత్రం మళ్లీ అదే రూమర్.. అప్పుడు ఇంట్లో వాళ్లకి అర్ధం అయ్యింది. ఓహో సినిమా పరిశ్రమలో కామనేలే అని అనుకున్నారు.

ఇంతకి ఈ కథంతా ఏ హీరోది అని అనుకుంటున్నారా? ఆ హీరో ఎవరంటే నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ హీరో చేస్తున్న ప్రతి సినిమాలో హీరోయిన్‍తో డేటింగ్ చేస్తున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. సెట్స్ లో హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాడట ఈ హీరో. అందుకే ఈ గాసిప్పులు గట్టిగానే వినిపిస్తున్నాయి.

అయితే ఈ గాసిప్పులు సినిమా సినిమాకు రావడంతో ఇంట్లో వాళ్లు కూడా విని విని విసుగొచ్చి ఇలాటివి వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ హీరోతో నటించిన సోనారికా, రాశి ఖన్నాలతో తాను డేటింగ్ చేస్తున్నాడని గాసిప్పులు వచ్చాయట. ఇంకో విషయం ఏంటంటే తనతో సినిమా తీయక పోయిన రెజినాతో కూడా డేటింగ్ చేస్తున్నాడు అని రూమార్స్ వచ్చాయట. సో అందుకే అనుకున్నోళ్లకు అనుకున్నంత నొప్పి తప్ప తనకు మాత్రం ఒరిగేదేమి లేదు అంటూ కచ్చితంగా చెబుతున్నాడు శౌర్య. మనవాడు చెప్పిందాట్లో కూడా పాయింట్ ఉంది కదా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -