Monday, April 29, 2024
- Advertisement -

ప్రముఖ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ క‌న్నుమూత‌

- Advertisement -

కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో మరణించారు. బాలాజీ వయస్సు 48. చెన్నైలోని ఆస్పత్రికి తరలించేలోపే బాలాజీ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో నటించారు. విలన్ రోల్స్‌కి కేరాఫ్‌గా నిలిచాడు. రాఘవన్ సినిమాలో సైకో విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టాడు. చివ‌ర‌గా గ‌త ఏడాది అరియ‌వాన్ అనే త‌మిళ సినిమాలో క‌నిపించాడు డేనియ‌ల్ బాలాజీ .

తెలుగులో సాంబ,వెంకటేష్ ఘ‌ర్ష‌ణ ,రామ్‌చ‌ర‌ణ్ చిరుత‌, నాగ‌చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో,నానితో టక్ జగదీష్‌లో విలన్‌గా కనిపించాడు. ఇదే బాలాజీకి చివరి తెలుగు మూవీ. గౌత‌మ్‌మీన‌న్‌తో డేనియ‌ల్ బాలాజీకి మంచి అనుబంధముంది. అందుకే గౌతమ్ మీనన్ సినిమాల్లో ఎక్కువగా నటించాడు. ఇవాళ చెన్నైలోని పుర‌సామివాకంలో డేనియ‌ల్ బాలాజీ అంత్య‌క్రియ‌లు జరగనున్నాయి. ఇక డేనియల్ మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -