Wednesday, May 8, 2024
- Advertisement -

బయ్యర్లు లేని బాలయ్య సినిమా ?

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న క్రేజీ 99 వ చిత్రం డిక్టేటర్ విడుదలకి అడ్డంకులు ఎదురవుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్న డిక్టేటర్ ని బయ్యర్లు ఎవ్వరూ కొనడానికి ముందుకురావడం లేదు.

కారణం బాలయ్య ట్రాక్ రికార్డ్ మీద కాదు, ఆ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించిన కోనవెంకట్ గురించి.ఒకప్పుడు కథకుడిగా స్క్రీన్ ప్లే రైటర్ గా వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న కోనకి ఇప్పుడు సరైన విజయం లేదు. ఈ ఇయర్ పండగచేస్కో, బ్రూస్ లీ, అఖిల్, త్రిపుర, శంకరాభరణం, సౌఖ్యం సినిమాలకు కథలు అందించిన కోన ఒక్క పండగచేస్కో విషయంలోనే ఎంతోకొంత సక్సెస్ అయ్యాడు,మిగిలిన సినిమాలన్నీ ఘోరపరాజయం పాలయ్యాయి.

ఇప్పుడు డిక్టేటర్ కి దర్శకుడు శ్రీవాసే అయినా సినిమాకు అన్నీ తానై చేశాడట కోన. దాంతో ఈ ఇయర్ విడుదల అయిన సినిమాల రిజల్ట్ ని బట్టి డిక్టేటర్ ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. కాని నిర్మాతలు మాత్రం భయపడకుండా ఎక్కువ చోట్ల సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -