- Advertisement -

ఎన్టీఆర్ సరసన కుమారి ?

- Advertisement -

లాస్ట్ ఇయర్ అలాఎలా సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన హీరోయిన్ హెబ్బాపటేల్. ఆ సినిమా సైలెంట్ హిట్ అయినా అమ్మడికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది, కాని ఆమెలోని టాలెంట్ ని గమనించిన టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ తన నిర్మాణంలో తెరకెక్కిన తొలి సినిమా కుమారి 21 F లో లీడ్ రోల్ చేసే ఛాన్స్ అమ్మడికి ఇచ్చాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అమ్మడికి తెగ డిమాండ్ పెరిగిపోయింది. కాని ఆచితూచి సినిమాలను ఒప్పుకుంటున్న హెబ్బాపటేల్ ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న 25 వ చిత్రం నాన్నకుప్రేమతో లో చిన్న రోల్ చేయాడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా ఈ వార్తా ముందే లీక్ అయినా ఇప్పుడు అమ్మడు చేస్తున్న రోల్ తో సహా లీక్ అయింది.

సినిమాలో హెబ్బాపటేల్ మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి చెల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది కాని ఎన్టీఆర్ సినిమా కాబట్టి ఎంత చిన్న రోల్ అయినా చేస్తాను అని హెబ్బాపటేల్ ఈ రోల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి కుమారితో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న హెబ్బాపటేల్ నాన్నకుప్రేమతోలో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -