Friday, May 10, 2024
- Advertisement -

అతడితో ఎలాంటి రిలేషన్ లేదనేసిన సమంత!

- Advertisement -

చెన్నై చిన్నది సమంత గురించి ఈ మధ్య రూమర్లు గుప్పుమంటున్నాయి. ఈమె చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో సంబంధాన్ని కలిగిఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కొంతమంది దక్షిణాది హీరోయిన్లు వ్యాపారవేత్తలతో సంబంధాలు కలిగి ఉండటం లేదా… వారినే వివాహం చేసుకొంటున్న నేపథ్యంలో సమంత కూడా అదే బాటలో నడుస్తుందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ రూమర్ల గురించి ఇన్నిరోజులూ సమంత కూడా ఏమీ మాట్లాడలేదు. దీంతో.. వాటికి బలం చేకూరింది.

అయితే ఇప్పుడు సమంత ఈ అంశం గురించి స్పందించింది. తను ఒక ఇండస్ట్రియలిస్ట్ తో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని ఆమె ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. చెన్నైకి చెందిన వ్యాపారస్తుడికి.. తనకూ ఎలాంటి సంబంధం లేదని.. ఆమె వ్యాఖ్యానించింది. తను ఎవరి ప్రేమలోనూ లేనని కూడా సమంత చెప్పడం విశేషం. ఇది వరకూ ఒక హీరోతో కూడా సమంత డేటింగ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వ్యాపారవేత్తతో ఆమె అనుబంధం వార్తల్లోకి ఎక్కింది. అయితే సమంత మాత్రం ఆ రూమర్లను ఖండిస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -